తాగునీటి కోసం కుళాయిల చెంతకు పోయే దుస్థితి ఇంకా కొన్ని గ్రామాల్లో తొలగిపోలేదు. గతంలో పట్టణాలలోనూ తాగునీటి కోసం కుళాయిల వద్ద వీధిపోరాటాలు జరిగేవి. ఇప్పటికీ గ్రామాల్లో అదే దుస్థితి. ఎంతో అభివృద్ధి చెందింది అనుకునే గుంటూరు జిల్లా
మేడికొండూరులో ఈ సంఘటన జరిగింది.
శివారులోని సిరిపురం వద్ద నిత్యం కుళాయిలో మంచినీళ్ళు పట్టుకుంటామని ఇదే తమను బజారున పడేస్తోందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాగునీటి కోసం తన ఇద్దరు కుమార్తెలు బిందెతో కుళాయి వద్దకు వెళితే, చిన్న దానయ్య అనే వ్యక్తి వేధిస్తున్నాడని వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన కోరిక తీరుస్తేనే మంచి నీళ్ళు పట్టుకోనిస్తానని షరతు పెట్టాడని ఆరోపించింది. తన కోరిక తీర్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని చిన్న దానయ్యపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కాలంలోనూ ఇదేం సమస్య అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. చిన్న దాసయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.