Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కేసీఆర్ కప్పం కట్టించుకుంటారు: చంద్రబాబు

Advertiesment
జగన్ అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కేసీఆర్ కప్పం కట్టించుకుంటారు: చంద్రబాబు
, శుక్రవారం, 8 మార్చి 2019 (20:13 IST)
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ జగన్ మోహన్ రెడ్డిని బలపరుస్తోంది. జగన్ ప్రోద్బలంతో కొన్ని వేలమంది తప్పుడు ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారు. జగన్ వల్ల వేల మందిపై కేసులు వేయాల్సి వస్తోంది అని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఫైల్ దొంగతనం చేశారంటూ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ చట్ట ప్రకారం ఓ ప్రైవేట్ కంపెనీ పైన తెలంగాణ పోలీసులు దాడులు చేస్తున్నారు అని ప్ర‌శ్నించారు. నావల్ల కావడం లేదు.. భయమేస్తోంది.. పోటీ చేయలేనంటూ కొందరు నేతలే చెబుతున్నారు.
 
డేటా చోరీ విషయంలో చట్ట ప్రకారం ఏవిధంగా వ్యహరించాలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం. డీజీపీ ఇంటి వ్యవహారం కోర్టులో ఉన్నా పడగొట్టేశారు. ఎవరికి రక్షణ ఉంది. ఓట్ల తొలగింపు వ్యవహారంపై మరింత ప్రచారం చేస్తాం. బతికున్న వారి ఓట్లను తొలగించే విధంగా అక్రమాలకు పాల్పడ్డం కరెక్టేనా..? అని అడిగారు. రాజకీయ పార్టీ ఫిర్యాదులు చేసే హక్కు ఉంది. కానీ ఏ అంశం మీదైతే ఫిర్యాదు చేస్తున్నారో.. అవే తప్పుడు విధానాలను వైసీపీ వ్యవహరిస్తోంది.
 
మా సమాచారాన్ని ప్రతిపక్షానికి ఇవ్వడం.. మా సమాచారాన్ని అడ్డుకోవడం కరెక్టేనా..? ఏపీ డేటా పోయిందని విచారణ చేస్తున్నారు.. అంత ప్రేమ ఉందా..? ఏపీపై తెలంగాణకు అంత ప్రేమ ఉంటే.. మాకివ్వాల్సిన బకాయిలు ఇవ్వొచ్చుగా..? టీడీపీ ఓడించి తన సామంత రాజైన జగన్ మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చొబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కేసీఆర్ కప్పం కట్టించుకుంటారు. గవర్నర్ల వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం. సంక్షేమ పథకాలపై చర్చ జరక్కుండా ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. జగన్, పీకే వంటి వారు బందిపోట్లు మాదిరి ఏపీపై పడుతున్నారు. ఏపీలో 11 లక్షల ఇళ్లను కట్టాను.. తెలంగాణలో ఒక్క ఇల్లైనా క‌ట్టారా అని ప్ర‌శ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబుకి కేసీఆర్‌ రిటర్న్ గిఫ్ట్ అదేనా? నటుడు శివాజీ సంచలన ఆరోపణలు...