ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణితో ఏపీలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం విభాగం సూచించింది.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వచ్చే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న మూడు రోజులు హైదరాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.