Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పా ముసుగులో వ్యభిచారం.. ఆన్‌లైన్‌ ద్వారా విటులకు వల...

Advertiesment
Hyderabad
, సోమవారం, 27 జనవరి 2020 (09:59 IST)
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తూ వచ్చిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెరలో ఉన్న పలువురు అమ్మాయిలకు విముక్తి కల్పించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యభిచార దందా వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఆరిపాక కృష్ణ, మరో యువతి, కేపీహెచ్బీలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని యూనివర్సల్ హెయిర్ అండ్ స్పా సెంటర్‌ను ప్రారంభించారు. 
 
అయితే, వ్యాపారం బాగా జరగాలని, డబ్బులు సంపాదించాలన్న దురాలోచన వచ్చింది. ఇదే అదునుగా జస్ట్ డయల్, సులేఖ తదితర ఆన్‌లైన్ యాప్ల ద్వారా కస్టమర్లను ఆకర్షించి, వారికి సోషల్ మీడియాలో ఫోటోలను పంపి, కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని దందాను సాగిస్తున్నారు. 
 
ఈ విషయమై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, దాడి చేయగా, కృష్ణ, ఓ యువతి, మరో ఇద్దరు విటులు పట్టుబడ్డారు. వారి నుంచి 6 సెల్ ఫోన్లు, రూ.1.36 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. యువతిని రెస్క్యూ కేంద్రానికి తరలించామని, నిందితులను కోర్టు ముందు హాజరు పరిచామని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఏది? పార్శిల్స్‌లో కూడా...