ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ జరిగింది. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దీనికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారంతా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమంటూ నినాదాలు చేశారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని కావాలని, అదీకూడా ముందుగా ప్రటించిన అమరావతి మాత్రమే ఉండాలని అమరాతి ప్రాంత రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
మూడు రాజధానులకు మద్దతుగానే గురువారం తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ కాలనీ నుంచి తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యువతీయువకులు అత్యధికంగా పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమంటూ వారు నినాదాలు చేశారు.