Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిమ‌ప్రియ‌కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డు

హిమ‌ప్రియ‌కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డు
విజ‌య‌వాడ‌ , సోమవారం, 24 జనవరి 2022 (15:27 IST)
శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వం మహిళాభివృద్ది శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డుకు ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి ఎంపికయ్యింది. ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో హిమ ప్రియను ఈ అవార్డ్ వరించింది. 
 
 
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం  వర్చ్యువల్ విధానంలో హిమప్రియకు ధ్రువపత్రంతో పాటు లక్ష రూపాయల నగదును అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఈ అవార్డును అందించారు. హరిప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీలో విధులు నిర్వర్తించేవారు. ఉద్యోగ రీత్యా 2018 సంవత్సరంలో జమ్మూకాశ్మీర్ లోని ఆర్మీ క్వార్టర్ లో నివాసముండేవారు. 2018 ఫిబ్రవరి 10 న వీరు నివాసముంటున్న క్వార్టర్ పై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో గాయాల పాలైన హిమప్రియ మనోధైర్యంతో వీరోచిత పోరాటం చేసింది. తన తల్లితో పాటు క్వార్టర్స్ లో ఉన్న కొంతమందిని కాపాడింది. 
 
 
ఉద్రవాదుల దాడిలో గాయాలైనప్పటికి హిమప్రియ చేసిన సాహసానికి ఈ అవార్డ్ వరించింది..సాహస బాలిక అవార్డుకు ఎంపికైన హిమప్రియను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా యంత్రాంగం అభినందించింది. ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నుండి హిమప్రియతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కోవిడ్ పాజిటివ్