ప్రకాశం జిల్లాకు వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరదనీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో నదిపై ఉన్న అన్ని డ్యామ్‌ల నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి.
ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్ల నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఈ సాయంత్రానికి బ్యారేజీకి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.