Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

ఆ 300 మంది అమ్మాయిల వీడియోలు మీరు చూసారా? పో పోండి: మీడియాను తరిమేశారు

Advertiesment
gudlavalleru college

ఐవీఆర్

, శనివారం, 31 ఆగస్టు 2024 (23:21 IST)
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి మహిళా హాస్టల్లో రహస్య కెమేరాల ఘటనను గురించి తెలుసుకునేందుకు, అక్కడి దర్యాప్తు పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాను, మహిళా సంఘాల నాయకులను కాలేజీ యాజమాన్యం తరిమికొట్టింది. మీడియా వారంతా కలిసి... హాస్టల్ గదుల్లో రహస్య కెమేరాలు అమర్చి వీడియోలు తీసారంటూ వస్తున్న వార్తలపై మీరు ఏమంటారు అని ప్రశ్నించడంపై కాలేజీ యాజమాన్యానికి చెందిన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
ఎవరయ్యా ఆ ప్రశ్న అడుగుతుందీ... 300 మంది అమ్మాయిల వీడియోలను తీసారా.. మీరు చూసారా? ఎక్కడ చూసారు, ఏం మాట్లాడుతున్నారు... నోటికి వచ్చింది మాట్లాడకండి. మైకులు, కెమేరాలు వున్నాయి కదా అని ఏదిబడితే అది మాట్లాడితే ఎలా అంటూ కసురుకున్నారు. ఒక దశలో మీడియావారి మైకులను పక్కకు నెట్టి దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు బాధితులకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాల నాయకులు బస్సులకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్, ఎంపియుపిఎస్ హిమాయత్ సాగర్ స్కూల్ విద్యార్థులకు LG ఎలక్ట్రోనిక్స్ పోషకాహార భోజనాలు