Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

gopichand thotakura

ఠాగూర్

, సోమవారం, 20 మే 2024 (12:31 IST)
రోదసీలోకి తొలి పర్యాటకు వెళ్లారు. అతని పేరు గోపీచంద్ తోటకూకర. తెలుగు వ్యక్తి. ఇపుడు ఈ పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతుంది. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును లిఖించుకున్నాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజన్ సంస్థ ఆదివారం న్యూ షెపర్డ్-25 పేరుతో ఆదివారం ఉదయం నిర్వహించిన అంతరిక్షయాత్రలో గోపి పాలుపంచుకున్నాడు.
 
టెక్సాస్‌లోని ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10.37 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక ధ్వనివేగానికి మూడింతల వేగంతో ప్రయాణించి భూ వాతావరణం, అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్ రేఖ ఎగువకు అంటే 105.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ వెంటనే పర్యాటకులు కాసేపు భార రహత స్థితిని అనుభవించారు. అక్కడి నుంచి భూమిని తనివితీరా వీక్షించారు. పది నిమిషాల్లోనే యాత్రను ముగించుకున్న నౌక ఆపై సురక్షితంగా భూమిని చేరింది. బ్లూ ఆరిజన్ నిర్వహించిన ఏడో మానవసహిత యాత్ర ఇది. తాము నివసించే భూమిని అంతరిక్షం నుంచి తనివితీరా వీక్షించారు. 
 
అయితే, రోదసీలోకి వెళ్ళిన తొలి తెలుగు పర్యాటకుడిగా గుర్తింపు పొందిన ఈ గోపీచంద్ తోటకూర సొంతూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వాసి. ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. అమెరికాలో స్థిరపడ్డారు. పైలట్‌గా, ఏవియేటర్‌గా పనిచేస్తున్నారు. విమానాలతోపాటు సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను కూడా ఆయన నడిపిస్తారు. అట్లాంటలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే వెల్నెస్ సంస్థను స్థాపించారు.
 
1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ రోదసీలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఓ భారతీయుడు, అందులోనూ ఓ తెలుగువాడు అంతరిక్షంలోకి వెళ్లి ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించారు. తాజా యాత్రలో మొత్తం ఆరుగురు పాల్గొనగా వారిలో 90 ఏళ్ల వయనున్న నల్లజాతి వ్యోమగామి ఎడెడ్వెట్ కూడా ఉండడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్