శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు అందజేస్తుంటారు. తాజాగా కడపకు చెందిన ఒక భక్తుడు తిరుపతి శ్రీవారి ఆలయానికి రూ.2 కోట్ల విలువైన 101 బంగారు తామరపువ్వులను విరాళంగా అందజేశారు.
తిరుపతి శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవ కోసం ప్రముఖ స్వర్ణకారుడు రూ.2 కోట్ల విలువైన 108 బంగారు తామరపువ్వులను ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఈ క్రమంలో బుధవారం కడపకు చెందిన దాత జ్యువెలరీ కంపెనీ అధినేతతో కలిసి వీఐపీ దర్శనంలో స్వామిని దర్శించుకుని ఈ బంగారు తామరపువ్వులను సమర్పించారు.
ఆపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాథ మండపంలో స్వామివారి పాదాల చెంత బంగారు తామరపూలను ఉంచి అర్చకులు ఆశీర్వదించి దేవస్థానం అధికారులకు సమర్పించారు.