సాధారణంగా తేలు పేరు చెప్పినా.. దాన్ని చూసినా భయపడిపోతాం. అలాంటి తేలు విషానికి మార్కెట్‌లో భలే డిమాండ్ వుంది. లీటర్ విషం ఏకంగా రూ.82 కోట్ల మేరకు ధర పలుకుతుంది. అందుకే కొందరు తేళ్ల ఫారాలను నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల కొద్దీ తేళ్లు ఒకే చోట లుకలుకలాడుతూ తిరుగుతుండటం చూడలేక పలువురు భయపడిపోతున్నారు.
తేలు విషాన్ని అనేక సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. అలాగే, ఇతర ఔషధల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాల్లో తేలు విషానికి అమిత ప్రాధాన్యత ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో తేళ్ల ఫారాలు వెలిశాయి. కేన్సర్ మందలు తయారీలోనూ తేలు విషం వాడుతున్నారు. ఈ విషాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యేక పద్దతులను కూడా అవలంభిస్తున్నారు.
సాధారణంగా ఒక్కో తేలు నుంచి రోజుకు 2 మిల్లీలీటర్ల విషాన్ని సేకరిస్తుంటారు. తేలు కొండెను ట్విజర్స్‌తో పిండి విషాన్ని వెలికి తీస్తారు. ఈ ప్రక్రియలో తేలుకు ఎలాంటి హాని జరగదు. నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈవీడియోను మీరు కూడా చూడండి