Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగనన్న ఇళ్ళు ...ఆనందాల లోగిళ్ళు... నెర‌వేరిన పేదింటి క‌ల‌

Advertiesment
జగనన్న ఇళ్ళు ...ఆనందాల లోగిళ్ళు... నెర‌వేరిన పేదింటి క‌ల‌
విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (18:08 IST)
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేపట్టని విధంగా  రాష్ట్రంలో స్వంత ఇల్లు లేని నిరుపేద కుటుంబ  ఉండకూడదనే ఆశయంతో పేదలకు పెద్ద ఎత్తున గృహాలను అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవరత్నాల కార్యక్రమంలో భాగంగా నిరుపేదలందరికీ స్వంత గృహాలు అందిస్తానన్న హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి  అడుగులు వేస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా  నిరుపేదలకు 17,005 వై.ఎస్.ఆర్ జగనన్న కాలనీలలో 30 లక్షలకుపైగా  పక్కా గృహాల నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
 
 
పేదలకు  స్థలం అందించడంతో పాటు ఆ స్థలంలో పక్కా గృహాన్ని అందించడమే  లక్ష్యంగా " జగనన్న ఇళ్ళు " కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టింది. జ‌గనన్నకాలనీలలో వందలు, వేలాదిగా ఇళ్లు నిర్మిస్తున్నారు. జగనన్న కాలనీలు జగనన్న ఊళ్లను తలపించేవిగా ఉంటున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. జగనన్న  ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం  ఒక మహా యజ్ఞంలా  చేపట్టింది.  
 

నిర్దేశించిన సమయానికే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా అధికార యంత్రాంగాన్నిసమాయత్తం చేస్తోంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను లబ్ధిదారులు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అంతేకాక ఐరన్, సిమెంట్ ను సబ్సిడీ ధరలకే అందించి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఒక్కో ఇల్లు 340 చదరపు అడుగుల్లో లివింగ్‌ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్, టాయిలెట్, వరండా ఉంటాయి. 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్‌లైట్లు, 4 బల్బులను లబ్దిదారులకు ఉచితంగా అందించడం జరుగుతుంది. 
      

"జగనన్న ఇళ్ళు " కార్యక్రమం కింద నూజివీడు మండలంలో మొత్తం 8 వేల 868 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగింది. వీటిలో నూజివీడు పట్టణంలో 3008 మంది లబ్దిదారులకు, గ్రామీణ ప్రాంతంలో 5860 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు ఇళ్ళు నిర్మాణం కూడా మంజూరు చేసారు. 
 

నూజివీడు పట్టణం 25వ వార్డ్ కు చెందిన మల్లెల అంకమ్మ, 12వ వార్డ్ కు చెందిన గాదె లక్ష్మి కృష్ణ, 8వ వార్డ్ కు చెందిన వేముల లక్ష్మి భాగ్యంలు తన సంతోషాన్ని తెలియజేస్తూ, స్వంత ఇల్లు తన చిరకాల స్వప్నమని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తనకు ఇల్లు మంజూరు కాలేదన్నారు. ఇక స్వంత ఇంటిపై ఆశలు వదులుకున్నామన్నారు. తమ ఇంటిదగ్గరలోని వార్డ్ వాలంటీర్ తమ వద్దకు జగనన్న ఇళ్ల పధకంలో  తమ వివరాలు నమోదు చేసుకున్నారని, అతి కొద్దీ రోజుల్లోనే తమకు ఇంటి స్థలం మంజూరైనదని, ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిసి నమ్మలేకపోయామని, తమ స్వంత ఇంటి కళను నెరవేర్చిన  ముఖ్యమంత్రికి తాము జన్మంతా రుణపడి ఉంటామన్నారు. 
 

నూజివీడు మండలం కానసనపల్లి కి చెందిన బజారు స్వాతి పట్టణం తమ అభిప్రాయం తెలియజేస్తూ, తన భర్త రోజు కూలీగా పనిచేస్తున్నారని, తమ కుటుంబానికి స్వంత ఇల్లు తీరని కల అని భావించామని కానీ ప్రజల మనిషి, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించే జగనన్న పేద ప్రజల స్వంత ఇంటి కల నెరవేర్చే దిశగా నవరత్నాలు కార్యక్రమంలో  " పేదలందిరికీ  ఇళ్ళు " కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, పేదలకు స్వంత ఇళ్ళు అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. తమకేకాదు, తమలాంటి ఎంతో పేదల స్వంత ఇంటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వమన్నారు.  తాము కలలో కూడా ఊహించని వరాన్ని అందించిన జగనన్నను తాము మరచిపోలేమన్నారు.     
 

ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ళు  మంజూరు చేయడం దేశ  చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ  ఇంతవరకు జరగలేదు. అర్హులైన ప్రతీ ఒక్కరికి స్వంత ఇల్లు కల్పించాలన్న జగనన్న సత్సంకల్పానికి ఈ పధకం మరో మైలురాయిగా మిగిలిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 వరల్డ్ కప్: భారత్ సెమీస్ ఆశలు, అఫ్గానిస్తాన్ విజయం కోసం ఎదురుచూపులు