Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలిపిరి వద్ద టోల్‌ చార్జీల బాదుడు రూ.50 నుంచి రూ.200కు పెంపు

అలిపిరి వద్ద టోల్‌ చార్జీల బాదుడు రూ.50 నుంచి రూ.200కు పెంపు
, మంగళవారం, 1 జూన్ 2021 (12:36 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వాహనాల్లో వెళ్లే భక్తులకు ఇకపై జేబుకు చిల్లుపడనుంది. టోల్ చార్జీలను ఒక్కసారిగా విపరీతంగా పెంచేశారు. ఇప్పటివరకు కనిష్టంగా ఉన్న  రూ.15ను రూ.100కు, రూ.50ను రూ.200కు పెంచేశారు. ఈ పెంచిన ధరలు కూడా మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 
 
ఇప్పటివరకు ద్విచక్ర‌వాహ‌నాల‌కు ఉచితం. ఇది కాస్త ఊరట కలిగించే అంశం. కొండపైకి వెళ్లే కార్ల‌కు రూ.50, బ‌స్సుల‌కు రూ.100 చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం వ‌సూలు చేస్తోంది. దీంతో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ఇక మీదట టోల్‌గేట్ రూపంలో అదనపు భారం తప్పదు. 
 
కలియుగ వైకుంఠంగా అలరారుతోన్న తిరుమలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్ద ఉన్న ఈ టోల్‌గేట్ మీదు గానే ప్రయాణించాల్సి ఉంటుంది. 
 
సాధారణ రోజుల్లో సగటున రోజూ 10 వేలకు పైగా వాహనాలు ఈ టోల్‌గేట్ మీదుగా తిరుమలకు వెళ్తుంటాయి. వారాంతపు రోజులు, పండుగలు ఇతర ప్రత్యేక దినాల్లో ఈ వాహనాల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఆయా వాహనాల నుంచి టోల్ ఛార్జీలను వసూలు చేయడానికి అలిపిరి వద్ద ప్రత్యేక వ్యవస్థను టీటీడీ అధికారులు ఇది వరకే ప్రవేశపెట్టారు.
 
అయితే, ఇప్పటివరకూ నామమాత్రంగా వాహనాల ఛార్జీలను వసూలు చేస్తుండేవారు. దశలవారీగా ఆ ఛార్జీలను పెంచుకుంటూ వచ్చారు. ఈ సారి మాత్రం ఒకేసారి భారీగా పెంచారు. ఇప్పటిదాకా కనిష్ఠంగా 15 రూపాయలు, గరిష్ఠంగా 100 రూపాయలను టోల్ ఛార్జీ కింద వసూలు చేసేవారు. 
 
ఇప్పుడిది రెట్టింపయింది. కనిష్ఠ ఛార్జీ 50 రూపాయలు, గరిష్ఠ చార్జీ 200 రూపాయలకు పెరిగింది. ఈ టోల్‌గేట్.. టీటీడీ సెక్యూరిటీ విభాగం ఆధీనంలో ఉంటుంది. ఈ సెక్యూరిటీ సిబ్బంది చేసిందే ఇక్కడ చట్టం. ఇపుడు ఈ కొత్త టోల్ చార్జీలతో భక్తులపై అదనపు భారంపడనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భయపెడుతున్న కరోనా మూడో వేవ్.. మహారాష్ట్రలో 8000 చిన్నారులకి కరోనా!