Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ చైతన్య చీఫ్ బీఎస్ రావుకు అదే ప్రేరణ.. చంద్రబాబు సంతాపం

BS Rao
, గురువారం, 13 జులై 2023 (21:44 IST)
BS Rao
శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బీఎస్ రావు ఇకలేరు. బాలికల కోసం ప్రత్యేకించి కళాశాలలు కనిపించకపోవడం.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్ విద్యకు వచ్చేసరికి సరైన ప్రతిభ కనబరచకపోవడంతోనే తాను శ్రీ చైతన్య విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రేరణగా నిలిచిందని ఆ సంస్థల అధినేత, బీఎస్ రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
ఇరాన్ నుంచి భారత్‌కు వచ్చి తన కుమార్తెల విద్య కోసం మంచి స్కూల్ వెతికతే కనబడలేదని.. ఆ క్రమంలోనే బాలికల కోసం.. ఇంటర్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థను స్థాపించినట్లు తెలిపారు. అనతికాలంలోనే తమ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లలో మంచి మార్కులు వచ్చాయన్నారు. అలా స్థాపించిన శ్రీచైతన్య తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో పలు రాష్ట్రాలకు చేరిందన్నారు. 
 
ఇకపోతే.. బీఎస్ రావు మృతి పట్ల ప్రముఖ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. విద్యా దార్శనికుడు, శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఇక లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి బీఎస్ రావు ఎంతగానో కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్లదొరలే పారిపోయారు.. ఆఫ్ట్‌రాల్ ఈ జగన్ ఎంత? పవన్ కళ్యాణ్ వార్నింగ్