Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్దాయనతో ప్రేమా? బ్రేకప్ చెప్పుకున్న మోదీ-సుస్మితా సేన్ (వీడియో)

Advertiesment
Sushmita-Lalit modi
, మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (18:20 IST)
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ సన్నిహితంగా వున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. జులై 14న లలిత్ మోదీ.. సుస్మితా సేన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సుస్మిత మాత్రం ఈ బంధం గురించి ఎలాంటి వివరాలను బహిర్గతం చేయలేదు. 
 
కానీ, సుస్మితతో తన సంబంధాన్ని బహిరంగ పరిచిన వెంటనే మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ డిస్‌ప్లే చిత్రంగా ఆమెతో ఉన్న ఫొటోను పెట్టారు. అలాగే, తన ఇన్‌స్టాగ్రామ్ బయోని కూడా మార్చారు. దానిలో, "ఫౌండర్ @iplt20 ఇండియన్ ప్రీమియర్ లీగ్. చివరకు నా తోడుదొంగ, ప్రేయసి సుస్మితా సేన్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించాను" అని రాశారు. 
 
అయితే, వయసులో చాలా తేడా ఉన్న ఈ ఇద్దరూ ప్రేమలో పడటంపై అందరూ షాకయ్యారు. అయితే, ఈ ఇద్దరి ప్రేమ మూన్నాళ్ల ముచ్చటే అయిందట. ఈ ఇద్దరూ విడిపోయారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల, లలిత్ మోదీ తన ఇన్ స్టాలో డిస్ ప్లే పిక్చర్, బయోలో సుస్మిత ఫొటో, ఆమె ప్రస్తావనను తీసేయడంతో వీళ్లు బ్రేకప్ అయ్యారన్న పుకార్లకు బలం చేకూరుతోంది.  
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెగిటివ్ టాక్ లోనూ విజయ్ దేవరకొండ లైగర్ కలెక్షన్స్