Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోనసీమలో ఒమిక్రాన్ కలవరం - తూగో జిల్లా మహిళకు పాజిటివ్!

Advertiesment
కోనసీమలో ఒమిక్రాన్ కలవరం - తూగో జిల్లా మహిళకు పాజిటివ్!
, శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ క్రమంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఇపుడు మరో కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అయినవిల్లి మండలం, నేదునూరు పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఈమె ఇటీవలే గల్ఫ్ నుంచి సొంతూరుకు వచ్చింది. 
 
ఇపుడు ఆమెకు పాజిటివ్ అని తేలడంతో ఆమెతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి, ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసుతో కలుపుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. 
 
కరోనా కేసులు 6,650
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. దీంతో పాటు ఒమిక్రాన్ వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. ఫలితంగా గత 24 గంటల్లో 6,650 కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358కు చేరాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాక శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్ సోకి 374 మంది చనిపోగా, 7051 మంది ఈ వైరస్ నుంచి విముక్తిపొందారు. ప్రస్తుతం దేశంలో 77516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3,42,15,977 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
దేశంలో ఒమిక్రాన్ దూకుడు 
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. గురువారానికి దేశ వ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 361కు చేరింది. వీరిలో ముగ్గుర డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క తమిళనాడులో ఒకే రోజు ఏకంగా 33 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల జాబితాలో తమిళనాడు మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
ఇప్పటికే డెల్టా వేరియంట్‌ ఓ వైపు భయపెడుతుంది. మరోవైపు, ఒమిక్రాన్ టెన్షన్ ప్రారంభమైంది. ఈ మధ్య భారత్‌లోకి ప్రవేశించిన ఈ వైరస్... క్రమక్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. గురువారం మరో 89 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది.  
 
ఢిల్లీలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేసింది. అలాగే, ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చింది. గుజరాత్‌లోని 9 నగరాల్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. కర్నాటక రాష్ట్రంలో సామూహిక వివాహాలపై నిషేధం విధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. ఒమిక్రాన్ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫెర్రీ బోటులో అగ్నిప్రమాదం - 32 మంది మృత్యువాత