Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే మగతనమా? పవన్‌పై జగన్ ధ్వజం

Advertiesment
నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే మగతనమా? పవన్‌పై జగన్ ధ్వజం
, మంగళవారం, 4 డిశెంబరు 2018 (09:39 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే పవన్ మగతనమా? అంటూ ప్రశ్నించారు. ఒకరితో కాపురం చేస్తూ మరొకరితో పిల్లన్ని కనడం కూడా మగతనమేనా? అని ప్రశ్నించారు. అంతేనా, రేణూ దేశాయ్‌ను ఫ్యాన్స్ దూషిస్తుంటే చూస్తూ మిన్నకుండిపోవడం కూడా మగతనమేనా? అని నిలదీశారు. 
 
జనసేన ఆధ్వర్యంలో సాగుతున్న ప్రజా పోరాట యాత్రలో జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పవన్ కళ్యాణ్ వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి జగన్ తన పాదయాత్రలో భాగంగా రాజాం సభలో జరిగిన బహిరంగ సభలో కౌంటర్ ఇచ్చారు. 
 
పవన్ కళ్యాణ్ అనే పెద్దమనిషి ఇటీవలి కాలంలో మగతనం గురించి పదేపదే మాట్లాడుతున్నాడు. నిత్య పెళ్లి కొడుకులా, నాలుగేళ్ళకోసారి కారును మార్చినట్టు భార్యను మార్చడమేనా మగతనమా? తనతో కాపురం చేస్తూనే మరో స్త్రీని గర్భవతిని చేసి, పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చారని పవన్ రెండో భార్య రేణూ దేశాయ్ ఇటీవల టీవీల ముందుకు వచ్చి చెప్పారు. తనతో జీవితాన్ని పంచుకున్న ఆమెను అభిమానులు సోషల్ మీడియాలో వేధిస్తుంటే మౌనంగా ఉండటమే మగతనమా? పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను పవన్ కళ్యాణ్ రోడ్డుమీదికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. 
 
చేసి పని తప్పు అని ఎవరైనా ఎత్తిచూపితే వారి ఇళ్లలోని ఆడవాళ్ళ మీద సిగ్గులేకుండా సోషల్ మీడియాలో లేనిపోని అబద్దాలతో పోస్టింగుల్ పెట్టిస్తాడు. ఇది మగతనమా? అని పవన్ కళ్యాణ్‌ను జగన్ నిలదీశారు. ఒకవైపు రాజధాని భూసమీకరణ బాధితుల తరపున పోరాడుతున్నట్టుగా ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్... అదే పూలింగ్‌లో తన భూములు పోకుండా కాపాడుకున్న లింగమనేని నుంచి ఎకరాకు కోట్లు పలికే భూమిని రూ.20 లక్షలకే కొనుగోలు చేశారు. ఇది అవినీతి కాదా? అంటూ జగన్ నిలదీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీకో నమస్కారం.. నీ సలహాకో నమస్కారం... రాహుల్‌కు దండం పెట్టిన నారాయణ