Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మానాన్నా నన్ను క్షమించండి, నా ప్రేమికుడు ఇలా చేశాడు, అందుకే చనిపోతున్నా

అమ్మానాన్నా నన్ను క్షమించండి, నా ప్రేమికుడు ఇలా చేశాడు, అందుకే చనిపోతున్నా
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (13:38 IST)
గాఢంగా ప్రేమించానన్నాడు. తను లేకుంటే చచ్చిపోతానన్నాడు. నువ్వే సర్వస్వమన్నాడు. అన్నీ నమ్మింది. అతనికి పెళ్ళికి ముందే సర్వస్వం అర్పించింది. ఇంట్లో పెద్ద వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోకపోతే అతనితోనే పారిపోయింది. కానీ అతని నిజ స్వరూపం తెలిసి చివరకు తనువు చాలించింది.
 
కడప జిల్లా రాజంపేట మండలంకి చెందిన కోకిల, రాజంపేటకు చెందిన శివకుమార్‌లు గత సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు. స్నేహితురాలి ద్వారా శివకుమార్ కోకిలకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త గాఢ ప్రేమగా మారిపోయింది. ఏ విధంగా అంటే ఒకరినొకరు విడిచి పెట్టలేనంతగా.
 
అయితే ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్ళికి అంగీకరించలేదు. దీంతో ప్రియుడి చెప్పిన మాటలను విన్న కోకిల ఇంటి నుంచి వచ్చేసింది. కడప నగరానికి తీసుకొచ్చిన శివకుమార్ పెళ్ళి చేసుకోకుండానే కాపురం పెట్టేశాడు. అయితే అంతటితో ఆగలేదు.
 
తను గదికి అద్దెకు తీసుకున్న ప్రాంతంలో మరో మహిళతో ఎఫైర్ కూడా పెట్టుకున్నాడు. మార్కెట్‌కు వెళ్ళి కూరగాయలను తీసుకొని గదికి వచ్చిన కోకిల శివకుమార్‌తో పాటు మరో మహిళను చూసి షాకైంది. నిన్ను నమ్మి సర్వస్వం అప్పగించాను. నన్నే పెళ్ళి చేసుకుంటానని చెప్పావు. ఇదేంటని ప్రశ్నించింది.
 
అయితే ఆమెను ఓదార్చకుండా శివకుమార్ కోకిలను చావబాదాడు. దీంతో మనస్థాపానికి గురైన కోకిల గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అసలు తనెందుకు చనిపోతున్నానన్న విషయాన్ని సుసైడ్ లేఖలో రాసింది. తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణాంతకం కాదు కానీ ప్రమాదకరమే... సెకండ్ వేవ్ కరోనాతో జాగ్రత్త