Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైందా? మాస్క్ మస్ట్!!

Advertiesment
covid test
, గురువారం, 21 ఏప్రియల్ 2022 (07:53 IST)
దేశ రాజధాని ఢిల్లీ కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని కోరుతున్నారు. ఈ మేరకు సమావేశమైన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ (డీడీఎంఏ) మాస్క్ ధరించని వారి నుంచి రూ.500 అపరాధం వసూలు చేసేలా ఆదేశాలు జారీచేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలు, కాలేజీలను మూసివేసేలా ఆదేశాలు ఇవ్వబోమని డీడీఎంఏ అధికారులు స్పష్టం చేశారు. అదేసమయంలో నిబంధనలను క్రమంగా కఠినతరం చేస్తుంది. 
 
మరోవైపు, బుధవారం వెల్లడించిన గణాంకాల మేరరకు ఢిల్లీలో కొత్తగా 2067 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 40 మంది చనిపోయారు. కొత్త కేసుల్లో అత్యధిక భాగం హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మిజోరంలోనే బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. 
 
మరోవైపు, గత మూడు నెలలుగా దేశంలో ఒక్క శాతానికి దిగువనే ఉన్న ఆర్ వాల్యూ ఈ నెల 12-18వ తేదీతో ముగిసిన వారంలో 1.07 శాతానికి పెరగడం యాక్టివ్ పెరిగిందని చెన్నైకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23న ఉమ్మడి పగో జిల్లాలో జనసేనాని పర్యటన