Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీకి 'డైకి'

ఏపీకి 'డైకి'
, బుధవారం, 30 అక్టోబరు 2019 (05:37 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీసిటీలో  ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమైన జపాన్‌కు చెందిన దిగ్గజ అల్యుమినియం పరిశ్రమ ‘డైకీ అల్యుమినియం’ ప్రతినిధులకు పరిశ్రమలు వాణిజ్య, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అభినందనలు తెలిపారు.

మంగళవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని డైకీ అల్యుమినియం పరిశ్రమ ప్రతినిధులు కలిశారు. ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన, సంక్షేమ నిర్ణయాలు, సంస్కరణల గురించి జపాన్ ప్రతినిధులకు మంత్రి వివరించారు.

అందుకు సమాధానంగా డైకీ ప్రతినిధులు యువ ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని కితాబునిచ్చారు. నాణ్యమైన అల్యుమినియం అందించడంలో రాజీపడకుండా ముందుకువెళుతున్న డైకీ పరిశ్రమ సేవలను  మంత్రి మేకపాటి అభినందించారు. డైకీ ఉక్కు కర్మాగారానికి  తగ్గ ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యాక్రమాన్ని చేపడాతమని మంత్రి మేకపాటి  గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 
 
డైకి అల్యుమినియం ఇండస్ట్రీ కో.లిమిటెడ్ గురించి క్లుప్తంగా.... 
 డైకీ అల్యుమినియం కర్మాగారం జపాన్‌లోని ఒసక ప్రాంతంలో ఉంది. ఈ కర్మాగారానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలో అతి పెద్దది, ప్రాచీనమైనది. 1922 నుంచీ అత్యంత నాణ్యమైన అల్యుమినియం అందించే పరిశ్రమగా పేర్గాంచింది. హోండా, నిసాన్, టొయోటా, సుజూకీ వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా డైకీ కస్టమర్లే. అల్యుమినియం సరఫరా చేయడమే కాకుండా ఉత్పత్తి రంగంలోనూ ‘డైకీ’ స్వతంత్రంగా దూసుకెళ్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాచేపల్లి అత్యాచార ఘటనను నీరుగార్చేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర..తెదేపా