Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆవు పాలతో కరోనా చెక్ పడుతుందా? తిరుపతిలో ఆద్భుతం!

ఆవు పాలతో కరోనా చెక్ పడుతుందా? తిరుపతిలో ఆద్భుతం!
, ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (13:01 IST)
ఆవు పాలతో కరోనా వైరస్ చెక్ పడుతుందా? అంటే... అవుననే అంటున్నారు. దీనికి చిత్తూరులో ఓ సంఘటన నిరూపితమైంది. హోం క్వారంటైన్‌లో తనతోపాటు తన బిడ్డను కూడా ఉంచుకుంది. ఆ సమయంలో ఆమె తన పాలు కాకుండా, ఆవు పాలను ఇస్తూ వచ్చింది. ఈ కారణంగానే ఆ బాలుడికి కరోనా సోకలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన జిల్లాల్లో చిత్తూరు ఒకటి. ముఖ్యంగా, జిల్లాలోని శ్రీకాకళహస్తి కరోనా హాట్ స్పాట్‌గా నిలిచింది. అయితే, చిత్తూరు జిల్లాలో అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన నగరివాసి ఒకరికి ఈ నెల 5న కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. 
 
వారికి పరీక్షలు చేస్తే ఆయన తమ్ముళ్ల భార్యలు ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని 8వ తేదీన చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు అందరూ క్వారంటైన్‌లో ఉండటంతో ఏడాది బాలుడ్ని తన వెంటే తెచ్చుకుంది. 
 
సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి బాబును అప్పగిద్దామంటే నిరాకరించిన ఆమె తనవద్దే ఉంచుకుంది. కాగా ఆమెతో పాటుగా 18 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ ఏడాది కుమారుడికి కరోనా సోకలేదు. 
 
బాలుడికి దాదాపు నాలుగు సార్లు వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. దీంతో తల్లికి వరుసగా రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. 
 
తప్పనిసరి పరిస్థితుల్లోనే తన వద్ద ఉంచుకుని, రోజూ ఆవు పాలను పట్టేదాన్ని అని బాబు తల్లి చెప్పుకొచ్చారు. చిన్నారులకు వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుందని, కరోనా పాజిటివ్‌ వచ్చిన తల్లి వద్ద 18 రోజులున్నా.. బాబు సురక్షితంగా బయటపడటం సంతోషకరమైన అంశమని అధికారులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూమ్‌కు పోటీగా ఫేస్‌బుక్ వీడియో 'మెసెంజర్స్ రూమ్స్'