Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరవాడ ఘటనపై దర్యాప్తుకు నలుగురు సభ్యులతో కమిటీ

పరవాడ ఘటనపై దర్యాప్తుకు నలుగురు సభ్యులతో కమిటీ
, మంగళవారం, 14 జులై 2020 (13:13 IST)
విశాఖ పరవాడ ఫార్మాసిటీలో రోజుల వ్యవధిలోనే మరో ప్రమాదం జరగడంలోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.

ప్రమాదంపై విచారణ జరిపి‌ నివేదిక ఇవ్వాలని కమిటీ సభ్యులని ఆదేశించారు. డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు ఏర్పడ్డాయని, ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నామని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు.

వరుస ప్రమాదాల‌ నేపధ్యంలో మరోసారి జిల్లా స్ధాయిలో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాంకీ సాల్వెంట్‌ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు  శ్రీనివాసరావు  అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు.

మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయంవరకల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు.
 
 
శ్రీనివాస్ కుటుంబానికి రు.1 కోటి ఎక్స్ గ్రేషియా: సిపిఐ డిమాండ్
విశాఖ రాంకీ ఫార్మా కంపెనీ పేలుడులో మృతిచెందిన శ్రీనివాస్ కుటుంబానికి రు.1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
 
 "తరచుగా విశాఖపట్నం ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరగటం ఆందోళనకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయంతోపాటు ఆర్థిక సహాయం అందించాలి.
 
అధికారుల అలసత్వం, యాజమాన్యాల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తున్నవి. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీల్లో జరుగుతున్న ప్రమాదాలపై కమీషన్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం"అని రామకృష్ణ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణకు అరుదైన పక్షి!