నాకు చదువు చెప్పిన గురువులకు నా పాదాభివందనమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి టీచర్స్ డేగా జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో టీచర్స్ డే నిర్వహించారు. ఇందులో సీఎం పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన జీవితం తరతరాలకు స్పూర్తినిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా మనకు పాఠాలు చెప్పిన గురువు గుర్తుండి పోతారు. తనకు పాఠాలు చెప్పిన గురువు వెంకటప్ప పేరుతో నాన్న వైయస్ పాఠశాలను ప్రారంభించారు.గురువు విద్యార్థి గుండెలో యూ ఫ్రింట్ చేయగలరని చెప్పేందుకు ఇది నిదర్శనం.
నిరక్షరాస్యరాస్యత జాతీయ స్థాయిలో27 శాతం ఉంటే.. ఏపీలో 33 శాతం ఉంది. ఏపీలో ఇది సున్నాకు తీసుకు రావాలనే నా తాపత్రయం. దేశ వ్యాప్తంగా74 శాతం మంది ఇంటర్ దాటి ముందుకు వెళ్లడం లేదు. అందుకే ఏపీలో అమ్మ ఒడి, ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలుచేస్తున్నాం. ఈ నిష్పత్తులు పూర్తిగా మార్చేసి ఏపీని దేశానికి ఆదర్శంగా నిలపాలని నా కోరిక.
నా పాదయాత్రలో నన్ను కలిసిన కొంతమంది టీచర్లను ఆనాటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. టాయిలెట్స్ అధ్వానం.. పుస్తకాలు, డ్రెస్‌లు ఇవ్వలేదు. విద్యార్దులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేక పోయారు. నా పాదయాత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాను. మా ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో ఆధునీకరిస్తాం. నాడు.. నేడు అని మూడేళ్ల తర్వాత పాఠశాల రూపు రేఖలు మార్చి చూపుతాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ఆనందంగా పంపేలా ఉండాలి. అందుకు ఉపాధ్యాయులు ఉత్తమ బోధనా పద్దతులను అవలంబించాలి. మీరు.. మేము అందరం కలిసి మూడేళ్లల్లో మార్పు తీసుకు వద్దాం అంటూ జగన్ పిలుపునిచ్చారు.