Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Advertiesment
chandrababu naidu

ఠాగూర్

, మంగళవారం, 25 నవంబరు 2025 (19:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా, మార్కాపురం, మదనపల్లె ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటుకానున్నాయి. అలాగే, పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అంటే మూడు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. 
 
జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాలు, రెవన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు తదితర అంశాలపై మంత్రులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మరోమారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్య ప్రసాద్, వంగలపూడి అనిత, పి.నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు హాజరయ్యారు.
 
కాగా, ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దానిపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు.
 
ఇదే అంశంపై మరోమారు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలతోపాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. 
 
రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. మార్కాపురం (ప్రస్తుతం ప్రకాశం జిల్లా), మదనపల్లె (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా), రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపినట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు