కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 12 నుంచి 14 వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 నుంచి, 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన తేదీల్లో పోలింగ్ ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలను మూసివేసి ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఓట్ల లెక్కింపు రోజైన ఈ నెల 17న ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు జిల్లా అంతటా డ్రైడేగా ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.