Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంగోలు ఆస్పత్రిలో శవాలను పీక్కుతింటున్న కుక్క!!?? (Video)

Advertiesment
ఒంగోలు ఆస్పత్రిలో శవాలను పీక్కుతింటున్న కుక్క!!?? (Video)
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయే రోగుల పరిస్థితి మరింత దయనీంగా మారుతోంది. జిల్లా కేంద్రంలోనే ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా రోగులు అష్టకష్టాలుపడుతున్నారు. ఒకవేళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయే కరోనా రోగుల మృతదేహాలను తరలించేందుకు ఆస్పత్రి సిబ్బంది సైతం సాహసం చేయడం లేదు. దీంతో మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. ఈ హృదయ విదాకర సంఘటనకు సంబంధించి ఓ వీడియోను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఒంగోలు ఆస్పత్రిలో ఓ బెడ్ కింద రెండు రోజులుగా పడి ఉన్న మృతదేహం వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీన్ని చూస్తుంటే హృదయం బద్దలవుతోందన్నారు. సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని... రెండు రోజులుగా నేలపై మృతదేహం పడి ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. 
 
శవాన్ని కుక్కులు పీక్కుతుంటున్నాయని పేర్కొన్నారు. మానవతా విలువలకు తూట్లు పొడిచేలా వ్యవహరించారని... ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. ఈ ఘటనను ఖండించడానికి కూడా మాటలు రావడం లేదని అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకోవడంతో రోజుకు పదివేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెల్సిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్రిటికల్ : ఆర్మీ ఆస్పత్రి