ఎవరు పేరు చెబితే ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా పోతుందో ఆమే రోజా. ఇదేదో సినిమా డైలాగ్ లాగానే ఉన్నా రియల్ ఫాక్ట్. ఫైర్ బ్రాండ్ రోజా మళ్ళీ కదనరంగంలోకి దిగారు. తన వ్యక్తిగత గన్‌మెన్‌కు కరోనా సోకడంతో ఆమె ఇంటి వద్దే ఐసోలేషన్లో ఉన్న విషయం తెలిసిందే.
సుమారుగా 10 రోజుల పాటు ఇంటికే పరిమితమైన రోజా మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చారు. ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి కింది కరోనా సమయంలో 24 మంది నిరుపేదలకు 12 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు రోజా.
ప్రతిపక్షపార్టీ నేతలపై పదునైన విమర్సలను సంధించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా టెస్టులు ఎపిలో చేస్తుంటే చంద్రబాబునాయుడు హైదరాబాదులోని తన నివాసంలో కూర్చుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
ట్విట్టర్ బాబు నారా లోకేష్ సిఎంపై విమర్సలు చేసే ముందు తన అర్హత ఏంటో తెలుసుకోవాలన్నారు. కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు సేవ చేస్తున్నారని రోజా చెప్పారు. హోం ఐసోలేషన్ నుంచి తిరిగి రోజా జనంలోకి రావడంతో నగరి ప్రజలు పెద్ద ఎత్తున ఆమెను చూసేందుకు ఇంటి వద్దకు చేరుకున్నారు.
సామాజిక దూరాన్ని పాటిస్తూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ రోజా అభివాదం చేశారు. నగరి నియోజకవర్గంలో నిరంతరాయంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని రోజా ప్రజలకు హామీ ఇచ్చారు.