Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజధాని తరలింపు ఖాయం... అసెంబ్లీ ఉమ్మడి భేటీకి సీఎం జగన్ వ్యూహం

Advertiesment
రాజధాని తరలింపు ఖాయం... అసెంబ్లీ ఉమ్మడి భేటీకి సీఎం జగన్ వ్యూహం
, శనివారం, 28 డిశెంబరు 2019 (11:47 IST)
రాజధాని తరలింపు ఖాయమైపోయింది. అయితే, తరలింపు వ్యవహారంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
ఈ మేరకు శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలోనే సచివాలయం ఉంటుందని.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అక్కడే జరుగుతాయని తేల్చి చెప్పారు. దీంతో ఇక అమరావతిలోని అసెంబ్లీ భవనం శీతాకాల సమావేశాలకే పరిమితమవుతుందా అని మంత్రులు సందేహం వెలిబుచ్చుతున్నారు. 
 
అదేసమయంలో ప్రస్తుతం శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాజధాని మార్పునకు వ్యతిరేకంగా ఓటేస్తుందని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఎందుకంటే ఈనెల 17న అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ఏర్పాటు బిల్లులకు వ్యతిరేకంగా ఓటేసి సర్కారుకు టీడీపీ షాకిచ్చింది. 
 
ఈ పరిస్థితి రాజధాని మార్పు విషయంపై ప్రవేశపెట్టే బిల్లులో ఉత్పన్నంకాకుండా ఉండేందుకు వీలుగా జగన్ వ్యూహం రచించారు. అసెంబ్లీలో వైసీపీకి 150 మంది (స్పీకర్‌ మినహా) ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనమండలిలో బలం తక్కువగా ఉంది. దీంతో రెండు సభల ఉమ్మడి సమావేశం ఏర్పాటుచేసి రాజధాని తరలింపు బిల్లుపను ఆమోదింపజేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని రైతులతో మాటల్లేవ్‌... వారిని చంద్రబాబు మోసం చేశారు...