Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇష్టం లేని పెళ్లి చేశారనీ.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన నవవధువు

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారన్న కోపంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తను తన ప్రియుడితో కలిసి ఓ నవ వధువు హత్య చేసింది. అదీ వివాహమైన కేవలం పది రోజులకే ఈఘాతుకానికి పాల్పడింది.

Advertiesment
ఇష్టం లేని పెళ్లి చేశారనీ.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన నవవధువు
, మంగళవారం, 8 మే 2018 (09:41 IST)
తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారన్న కోపంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తను తన ప్రియుడితో కలిసి ఓ నవ వధువు హత్య చేసింది. అదీ వివాహమైన కేవలం పది రోజులకే ఈఘాతుకానికి పాల్పడింది. ఆపై దోపిడీ దొంగలు చేసిన పనిగా చిత్రీకరించి.. ఆ తర్వాత లాజిక్ మిస్సై అడ్డంగా బుక్కయ్యింది. ఈ దారుణం విజయనగరం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్ల గ్రామానికి చెందిన గౌరీశంకరరావు(30), సరస్వతికి ఈ నెల 28వ తేదీన వివాహం జరిగింది. అయితే గౌరీశంకరరావుతో పెళ్లి ఇష్టంలేని సరస్వతి ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో తన మాజీ ప్రియుడితో పాటు మరికొందరు స్నేహితులకు సుపారీ ఇచ్చి భర్త హత్యకు పథకం పన్నింది. 
 
ఈ పథకం ప్రకారం గరుగుబిల్లి మండలం తోటపల్లిలో కొత్త జంట బైక్ మీద వస్తుండగా దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో భర్త గౌరీశంకరరావు మృతి చెందాడు. అయితే.. భార్య సరస్వతికి గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం దోపిడిదొంగలు నగలు అపహరించుకుపోయారు. దుండగులు భార్య మెడలో బంగారం లాక్కొని వెళ్తుండగా భర్త అడ్డుకున్నాడు. దీంతో ప్రతిఘటించిన భర్తపై వారు దాడి చేసి చంపారు. అనంతరం పరారయ్యారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో పాటు... సరస్వతి కదలికలను ఓ కంట కనిపెట్టారు. ఈ క్రమంలో కట్టుకున్న భర్తను హత్య చేసి నగలు అపహరించిన వారితో సరస్వతి ఫోను చేసి.. నా నగలు నాకు తెచ్చివ్వాలని డిమాండ్ చేయడంతో హంతకులు హ్యాండిచ్చారు. అప్పటికే పోలీసులు ఓ కంటకనిపెట్టివుండటంతో సరస్వతి నిజస్వరూపం బహిర్గతమైంది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటుకు నోటు కేసు: ఆ గొంతు చంద్రబాబుదే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌.. కేసీఆర్ ఏమన్నారంటే?