Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పచ్చని పొలాలను శ్మశానవాటికలా తయారు చేశారు అన్నాను అధ్యక్షా...

Advertiesment
Assembly News
, మంగళవారం, 10 డిశెంబరు 2019 (15:34 IST)
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న పచ్చని పొలాలను శ్మశానవాటికలా తయారు చేశారు అని అన్నానే గానీ, శ్మశానంలా ఉందని అనలేదు అధ్యక్షా అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఆయన రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడంపై వివరణ ఇచ్చారు. 
 
రాజధాని గురించి మాట్లాడుతున్నప్పుడు రాజధాని ఉంటాదా ఉండదా, దీనికి అనుమతి ఉందా లేదా అని అడగండి డైరెక్టుగా తప్పులేదు దానికి సమాధానం చెప్తాం. ఇంకోమాట అన్నారు అధ్యక్షా, నేను శ్మశానం అన్నానన్నారు అధ్యక్షా. 
నేనేమన్నాను అధ్యక్షా. ఆ రోజు, ఇవాళ సభ గురించి, సభ సాక్షిగా చెప్తున్నాను. ఆ రోజు ఏం చెప్పాను చంద్రబాబునాయుడు రాజధాని పర్యటనకు వెళ్తారంట గదా అని ఓ విలేకరి అడిగాడు. 
 
ఏం వెళ్తాడయ్యా పచ్చని పొలాలు, సంవత్సరానికి మూడు పంటలు పండేవి, ఈ పరిస్ధితులు అన్నీ తెలిసి అక్కడ ఇప్పుడు చూస్తే శ్మశానవాటికలా తయారు చేశారు. ఇచ్చిన లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చిన పెట్టుబడులు అని చెప్పారు. ఆయన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, సుమారు ఐదువేల కోట్ల రూపాయలు కూడా ఖర్చుపెట్టలేదు. 
 
840 కోట్లు రూపాయలు కన్సెల్టెంట్లకు కోసం ఎంఓయూలు చేశారు. 320 కోట్లు ప్రజాధనాన్ని దుర్వనియోగం చేశారు. వంద అడుగులు లోతుకు పునాది తీయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితులున్నాయి అన్నాను అధ్యక్షా. ఈ పరిస్థితులును ఏం చూస్తాడయ్యా అని అన్నాను అధ్యక్షా. దాన్ని ఓ పత్రికలో వేశారు. రాయించింది వీళ్లే అధ్యక్షా, వీళ్లే మాట్లాడుతారు.

ఇవాలొచ్చి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వచ్చి పర్మిషన్‌ ఇచ్చిందా అని అడుగుతారు అధ్యక్షా. గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు దీనికి సంబంధం లేదు, పర్మిషన్‌ ఇచ్చింది స్టేట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంఫాక్ట్‌ ఎసెస్‌మెంట్‌ అధారిటీ (ఎస్‌‌సిఐఏ ఏ) ద్వారా పర్మిషన్‌ ఇస్తారు అని చెప్పాను. సభ్యుడు అవన్నీ వదిలేసి ఏవేవో అడిగారు.

కాబట్టి ఏదైతే అమరావతి నగరం ఉందో, ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చారో వాటిన్నంటికి ప్రభుత్వుం చిత్తశుద్ధితో ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారు కూడా చెప్పారు. అవన్నీ డెవలప్‌ చేసి ఇవ్వాలనే  నిర్ణయంతో ఉన్నాం. త్వరలోనే వారందిరికీ  డెవలప్‌ చేసి ప్లాట్లన్నీ ఇస్తామని తమరి ద్వారా చెపుతున్నాను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీ న్యూస్ : సన్నబియ్యం కాదు.. స్వర్ణరక బియ్యం : మంత్రి శ్రీరంగనాథరాజు