Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నువ్వు బతికుంటే కదరా.. పులివెందులలో జగన్‌పై పోటీ చేసేది : బీటెక్ రవికి పోలీసుల వార్నింగ్...?

cmramesh
, బుధవారం, 22 నవంబరు 2023 (08:17 IST)
వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా పులివెందులలో పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ నేత బీటెక్ రవిని పోలీసులు కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారని బీజేపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. ఎపుడు పది నెలల క్రితం కేసులో బీటెక్ రవిని పోలీసులు అరెస్టు కడప జైల్లో బంధించారు. ఆయనతో బీజేపీ నేత బీటెక్ రవి ములాఖత్ నిర్వహించారు. ఈ సందర్భంగా అరెస్టుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ములాఖత్ ముగిసిన తర్వాత సీఎం రమేష్ మాట్లాడుతూ, బీటెక్ రవిని పోలీసులే కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుందన్నారు. 
 
'పులివెందులలో టీడీపీ కార్యాలయం ఎందుకు కట్టావు? డబ్బులు ఎవరిచ్చారు? వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్‌పై పోటీచేసే ధైర్యం ఉందా? నువ్వు బతికుంటే కదా.. పోటీ చేసేది? ఇప్పుడే చంపేస్తాంటట అని పోలీసులు బెదిరించినట్లు బీటెక్ రవి తనతో చెప్పారన్నారు. 'వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? దానికి మీరు.. న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మధ్యవర్తిత్వం వహిస్తున్నారా? టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడానికి సీఎం రమేష్ కృషిచేస్తున్నారా?' వంటి అనేక విషయాలపై ఆరా తీశారని చెప్పారు. బీటెక్ రవి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. డేటాను డౌన్‌లోడ్ చేసుకున్నారని సీఎం రమేష్ చెప్పారు. మీడియాకు తెలియకపోతే చంపేసేవారని ఆరోపించారు. 
 
'సీఐ అశోక్ రెడ్డి వైకాపా కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారు. ఆయన వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తాం. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. త్వరలోనే అతని బండారాన్ని బయటపెడతాం. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకుని.. కడపలో పలు అక్రమాలకు పాల్పడ్డారు' అని ఆరోపించారు. 'పోలీసులు కాల్ డేటా బయటకు రాగానే మరిన్ని కుట్రలను బహిర్గతం చేస్తాం. పోలీసులను అడ్డుపెట్టుకుని, వారి ద్వారా వైకాపా అరాచకాలు సాగిస్తోంది. ఈ అరాచకాలకు ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయి. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న పోలీసులను వదిలిపెట్టం' అని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల్లో గెలవలేక... బాల్క సుమన్ ఫిర్యాదుతో ఐటీ సోదాలు : జి.వివేక్