అక్రమంగా మన దేశంలో చొరబడిన నలుగురు బంగ్లాదేశీయులను బెజవాడ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలో ఆ నలుగురు యువకులను విచారిస్తున్నారు. తుల్లానా జిల్లా నుండి భారత్ లోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులైన వీరు అసలు ఎందుకు వచ్చారో ఆరా తీస్తున్నారు. హౌరా- వాస్కోడిగామా రైలులో వీరు వెళ్తుండగా బెజవాడలో రైల్వే పోలీసులు వారిని నిలువరించారు. పాస్‌పోర్ట్ లేకుండానే వీరు రహస్యంగా నల్లాల ద్వారా భారత్ లోకి ప్రవేశించినట్టు గుర్తించారు.
ఇటీవల జరిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వీరు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నలుగురు యువకులుతో పాటు మరికొందరు బంగ్లాదేశీయులు ఉపాధి కోసం భారత్ లోకి అక్రమంగా వచ్చినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్ల డయింది.
వీరు పలు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడి నివాసాలు ఏర్పాటు చేస్తుకునట్టు గుర్తించారు.
నిందితుల నుండి నకిలీ పాన్, ఆధార్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెపుతున్నారు.