Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

balineni srinivasa reddy

ఠాగూర్

, మంగళవారం, 26 నవంబరు 2024 (15:11 IST)
అదానీ కంపెనీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కుంభకోణంలో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జనసేన పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందానికి ఏపీ ప్రభుత్వానికి అదానీ గ్రూపు రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్టు ఇటీవల అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ బహిర్గతం చేసిన విషయం తెల్సిందే. ఈ ఒప్పందం విషయం నాటి విద్యుత్ శాఖామంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డికి తెలుసంటూ వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 
 
వీటిపై బాలినేన శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తాను స్కామ్‌లో ఉన్నట్టు నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ప్రకటించారు. ఈ విషయంపై ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలి ఆయన సవాల్ విసిరారు. సెకీతో ఒప్పందం అంశంలో తనకు ఎలాంటి సంబంధంలేదనీ, తనకు దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టినట్టు, జనసేనలో చేరినప్పుడే చెప్పానని తెలిపారు. 
 
ఎవరి మెప్పు కోసమో మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, వైఎస్సార్ కుటుంబం అంటే జగన్‌ ఒక్కరేనా, విజయమ్మ, షర్మిల వైఎస్ కుటుంబం కాదా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. వారిపై అసభ్యకర పోస్ట్‌లు పెడితే పట్టించుకోరా, వారికి గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు లేవా అని మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?