Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయేషా కేసు.. రికార్డులన్నీ ధ్వంసమయ్యాయా? హైకోర్టు సీరియస్

2007, డిసెంబరులో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు హాస్టల్‌లో హత్యకు గురైంది. ఆయేషా డెడ్‌బాడీని తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశారు.

Advertiesment
అయేషా కేసు.. రికార్డులన్నీ ధ్వంసమయ్యాయా? హైకోర్టు సీరియస్
, శనివారం, 13 అక్టోబరు 2018 (13:08 IST)
2007, డిసెంబరులో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా.. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు హాస్టల్‌లో హత్యకు గురైంది. ఆయేషా డెడ్‌బాడీని తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరిపి సత్యంబాబు అనే యువకుడ్ని అరెస్ట్ చేయగా.. తర్వాత అతడు నిర్దోషని తేలడంతో విడుదలయ్యాడు. 
 
సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసులో అసలు దోషులను గుర్తించాలని, మళ్లీ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు.. ఈ కేసు విచారణను సిట్ నుంచి సీబీఐకి బదిలి చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఆయేషా హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లైంది.  
 
మరోవైపు ఈ హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయంటూ సిట్ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆయేషా కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సిట్ ఈ విషయాన్నికోర్టుకు తెలియజేసింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసు అప్పీలు పిటిషన్ కోర్టు విచారణలో ఉండగానే.. కేసుకు సంబంధించిన ఆధారాలును ధ్వంసం చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 
 
ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. ఆయేషా హత్య కేసుతో సంబంధమున్న న్యాయ, కార్యనిర్వాహణశాఖ అధికారుల్ని విచారించాలని తేల్చి చెప్పింది. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుందని పేర్కొంది.
 
అంతేగాకుండా ఈ కేసులో రాష్ట్ర పోలీసుల కన్నా సీబీఐ దర్యాప్తు మేలేమోనని కోర్టు అభిప్రాయపడింది. అలాగే సీబీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తామని, ఇప్పటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్‌ బృందం.. కేసు డాక్యుమెంట్లను సీబీఐకి అప్పగించాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోదీ.. విష్ణుమూర్తి 11వ అవతారమట..?