సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయనుంది. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు కొనుగోలు చేయనుంది. 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించేలా ప్రభుత్వ ప్రణాళిక రూపొందించనుంది. ఈఆర్‌సీ ఆమోదించడంతో త్వరలో సెకితో ఎంవోయూ కుదుర్చుకోనుంది. 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపింది. ఏడు వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ డిస్కంలకు అనుమతి ఇచ్చింది. 2026 సెప్టెంబర్ నాటికి 10వేల మెగా వాట్లు సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ సమ్మతించింది. సౌర విద్యుత్ కొనుగోళ్లపై త్రైపాక్షిక ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వీలింగ్, నెట్ వర్క్ ఛార్జీలు ప్రభుత్వం నుంచి తీసుకోవాలని ఈఆర్సీ సూచించింది. 2024 నుంచి 25ఏళ్ల పాటు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 2024 సెప్టెంబర్ నాటికి 3వేల మెగావాట్లు, 2025 నాటికి మరో 3వేల మెగావాట్లు, 2026 నాటికి 1000మెగావాట్లు కొనుగోలుకు డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది.