Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి

పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి
విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (12:26 IST)
సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా సి.ఎస్ ఆదిత్యానాద్ దాస్ ను కలిశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలపై సి.యస్ కు వినతిపత్రం అందించిన సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారి స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్టింది. దీనిపై సి.ఎస్. సానుకూలంగా స్పందించార‌ని జాని పాషా తెలిపారు. 
 
ఎ.పి.యన్.జి.ఒ'స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా సి.యస్ ఆదిత్యనాధ్ దాస్ ను కలిశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ ఎటువంటి శాఖాపరమైన పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని డిమాండు చేశారు. 
 
జూలై 2019 నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పొందిన 1.22లక్షల మంది సచివాలయ ఉద్యోగులు అందరికీ ఒకే కామన్ అపాయింట్మెంట్ డేట్  2019 అక్టోబర్2ను వర్తింపజేయాలని, కారుణ్య నియామకాలు,పేస్కేల్ వర్తింపజేయడం గురించి,చిన్న కారణాలతో సస్పెన్షన్స్ కు గురైన ఉద్యోగుల సస్పెన్షన్స్ తొలగింపు కోసం అభ్య‌ర్థించారు. ప్రొబేషన్ అనంతరం సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలని, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో జాబ్ చార్ట్ అమలు చేయాలని పంచాయతీల పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని కోరారు. 
 
అన్నీ విభాగాల సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై  సి.యస్ కు వినతిపత్రం సమర్పించి వారి ద్రుష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఎం.డి.జాని పాషా తెలిపారు. ఇటీవల ఎ.పి.పి.యస్.సి విడుదల చేసిన స్పెషల్ డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ లో వార్డు సచివాలయ ఉద్యోగులకు సంభందించిన పేపర్ కోడ్ 8 మరియు 10కి సంభందించి నోటిఫికేషన్ విడుదల చేయలేదనే విషయాన్ని వినతిపత్రం ద్వారా అందించి, దాదాపుగా 10వేల మంది వార్డు సచివాలయ ఉద్యోగులు నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్నారని సి.యస్ కు తెలిపారు.
 
అక్టోబర్2న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు అందరూ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలిపేందుకు సలాం సి.యం సర్ కార్యక్రమం నిర్వహించేందుకు ఫెడరేషన్ తరపున పిలుపునిస్తున్నామని ఎం.డి.జాని పాషా తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్ 2వ తేదీన శ్రమ దానం..పర్మిషన్ ఇవ్వని ఏపీ సర్కారు