Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ రాష్ట్రంలో లేకపోవడం వల్లే కుట్ర చేశారు : మంత్రి రోజా

Advertiesment
rk roja
, గురువారం, 26 మే 2022 (11:31 IST)
తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌ (రాష్ట్రంలో)లో లేకపోవడం వల్లే టీడీపీ, జనసేన పార్టీలు కుట్రపన్ని అమలాపురంలో అగ్గిరాజేశారని ఏపీ పర్యాటక మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. జిల్లా పేరు మార్పుతో ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళను తగలబెట్టడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇదే అంశంపై మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ, కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హింసకు పాల్పడటం అత్యంత దారుణమన్నారు. అంబేద్కర్ వంటి మహనీయుడి పేరును జిల్లాకు పెట్టడం పట్ల ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. నిజానికి అంబేద్కర్ పేరు పెట్టాలని విపక్ష పార్టీలు గతంలో నిరాహారదీక్షలు చేయాలని ఆమె గుర్తుచేశారు. అద్భుతంగా వైకాపా పాలనపై బురద జల్లేందుకే విపక్ష పార్టీలు ఈ పని చేస్తున్నాయన్నారు. ఈ హింసాత్మక చర్యలకు కారణమైన వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారు. 
 
సీఎం జగన్ రాష్ట్రంలో లేరని కుట్రలు చేస్తే కుదరదని, ఆయన ఎక్కడున్నా ఆయన దృష్టి మొత్తం ఏపీ మీదే ఉంటుందని అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్షర దోషం లేకుండా చదువుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నమయ్య జిల్లాలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం