Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట .. ఈ నెల 22 వరకు అరెస్టు చేయొద్దు : హైకోర్టు

Advertiesment
chandrababu
, మంగళవారం, 7 నవంబరు 2023 (13:36 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మరోమారు ఊరట లభించింది. ఈ నల 22వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు మంగళవారం సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, ఈ కేసు వాదనలు సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని, ఆ గడువు ముగిసేవరకు ఆయనను అరెస్టు చేయబోమని స్పష్టంచేశారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబమని కోర్టుకు తెలిపారు. ఆయన స్టేట్మెంట్‌ను రికార్డు చేసిన హైకోర్టు.. అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ తదుపరి విచాణనను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పనిలో తిరిగి చేర్చుకోలేదని డిప్యూటీ డైరెక్టర్‌ను గొంతు కోసి చంపేశాడు... ఎక్కడ?