Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తితిదే ఈవోగా ధర్మారెడ్డికి ప్రమోషన్ - సీఏం కార్యదర్శిగా జవహర్ రెడ్డి

jawahar reddy
, ఆదివారం, 8 మే 2022 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించారు. ఈయన ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్య నిర్వహణాధికారిగా ఉన్నారు. 
 
తాజాగా చేపట్టిన బదిలీల్లో ఈయనను తితిదే ఈవో నుంచి తొలగించి, మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదేసమసయంలో తితిదే జేఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పదోన్నతి కల్పించి తితిదే ఈవోగా ప్రభుత్వం నియమించింది. 
 
ఇకపోతే, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న సత్యనారాయణను బదిలీ చేసింది. యువజన సర్వీసుల శాఖ కమిషనరుగా ఉన్న నాగరాణిని రిలీవ్ చేసి ఆ స్థానంలో శారదా దేవిని నియమించింది. సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌ను మైనారిటీలో సంక్షే మశాఖ కార్యదర్శిగా నియమిస్తూ అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ బదిలీ ఆదేశాలు జారీచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇపుడున్న గ్యాస్ ధరతో అపుడు 2 సిలిండర్లు వచ్చేవి : రాహుల్