Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Nara Lokesh

ఠాగూర్

, శుక్రవారం, 10 జనవరి 2025 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో కీలక సంస్కరణలు చేయనుంది. ఇందులోభాగంగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాలను నెలకొల్పాలని భావిస్తుంది. అలాగే, గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేస్తారు. కొత్తగా తీసుకునిరానున్న విధానంపై తొలుత ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
గత ప్రభుత్వం 4731 స్కూల్స్‌ను తొలగించి ప్రాథమిక, ఉన్నత విద్య పాఠశాలల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను తిరిగి వెనక్కి తీసుకురావాలని భావిస్తుంది. అలాగే, ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేసి విద్యార్థుల సంఖ్య ఆధారంగా వాటిని ఉన్నతీకరించడం లేదా ప్రాథమిక బడులుగా మార్చాలని భావిస్తుంది. 
 
అలాగే, ఇంటర్మీడియట్‌తో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్ వ్యవస్థను కూడా తీసేసి, ఇంటర్‌ను ఇంటర్మీడియట్ విద్యా శాఖకు అప్పగించాలని భావిస్తుంది. గత యేడాది డిసెంబరు 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. అలాగే, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనులు పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల విధానాన్ని అమలు చేయనుంది. 
 
ఐదు రకాల స్కూళ్లు ఇవే...
పూర్వ ప్రాథమిక విద్య 1, 2 (ఎల్‌కేజీ, యూకేజీ) బోధించే అంగన్‌వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మారుస్తారు. 
పూర్వ ప్రాథమిక విద్య 1, 2తోపాటు 1,2 తరగతులను కలిపి ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్వహిస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య 1,2తోపాటు 1 నుంచి 5 తరగతులు ఉండేవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా వ్యవహరిస్తారు.
పూర్వ ప్రాథమిక విద్య 1, 2తోపాటు 1 నుంచి 5 తరగతులతో గ్రామ పంచాయతీ, వార్డు, డివిజన్‌కు ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తారు.
6 నుంచి 10 వరకు తరగతులు ఉండేవి ఉన్నత పాఠశాలలు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు