Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవనన్నకు జడ్ సెక్యూరిటీ ఉంటే జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నాం : మంత్రి నారా లోకేశ్

Advertiesment
nara lokesh

ఠాగూర్

, బుధవారం, 5 మార్చి 2025 (11:12 IST)
ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా పవన్ కళ్యాణ్ అన్నకు జడ్ సెక్యూరిటీ ఉంటే వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు వైకాపా నేతలు లేఖ కూడా రాశారన్నారు. ఇదే అంశంపై మంత్రి నారా లోకేశ్ తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో స్పందించారు. 
 
డిప్యూటీ స్పీకర్ సీఎం పవన్ కళ్యాణ్‌ కంటే ఎక్కువ భద్రతను జగన్‌కు కల్పిస్తున్నామని చెప్పారు. జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉందని, అయితే, వైకాపా నేతలు మాత్రం ఈ విషయాన్ని దాచి అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్ళడం లేదన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని శాసనసభ సాక్షిగా గతంలో జగన్ వ్యాఖ్యానించారని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలన్నారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని డిస్ట్రర్బ్ చేసి వైకాపా సభ్యులు పారిపోయారని విమర్శించారు. ప్రతిపక్ష హోదాకు ఎంత బలం ఉండాలో పార్లమెంట్ 121సీ నిబంధనలో స్పష్టంగా ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుంభమేళాతో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందంటున్న సీఎం యోగి.. ఎలా?