భావి తరాల విద్యా విధానాల కోసం వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు ఈ గ్రూపును ఏర్పాటు చేసింది. వర్కింగ్ గ్రూపులో నిపుణులు, ఉన్నతాధికారులకు చోటుకల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భవిష్యత్ తరాల విద్యా విధానం కోసం ప్రత్యేకంగా వర్కింగ్ గ్రూపను ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూపులో నిపుణులు, ఉన్నతాధికారులు ఉంటారు. తదుపరి తరం టెక్నాలజీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్‌ల అమలుకు ఈ వర్కింగ్ గ్రూపు కృషి చేస్తుంది. ఈ గ్రూపు ఏర్పాటుపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ వర్కింగ్ గ్రూపు ఛైర్మన్‌గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా విద్యాశాఖ కమిషనర్, అశుతోష్ చద్దా (మైక్రోసఫ్ట్ ఇండియా), షాలిని కపూర్ (అమెజాన్ వెబ్ సర్వీసెస్), శ్వేతా కరుణ (ఇంటెల్ ఆసియా), జై జీత్ భట్టాచార్య, అర్చన జి గులాటి తదితరులు సభ్యులుగా ఉంటారు.