Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై పాఠాలు చెప్పనున్న దినసరి కూలీ - డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన రత్నరాజు

Advertiesment
teacher job

సెల్వి

, గురువారం, 18 సెప్టెంబరు 2025 (10:49 IST)
ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అనేక మంది జీవితాలను మార్చగలదు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన డీఎస్సీ నియామకాలు చాలామంది ఉపాధి అవకాశాలను కల్పించాయి. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసేమ జిల్లాకు చెందిన దినసరి వేతన కార్మికుడు రత్న రాజు పరీక్ష ద్వారా ఉపాధ్యాయ పదవిని పొందారు. మెగా డీఎస్సీలో ఆయన 75వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. 
 
రాజు 2014లో తన బీఎడ్ పూర్తి చేసి, అదే సంవత్సరం 2018లో మళ్ళీ డీఎస్సీకి  ప్రయత్నించారు. కానీ రెండుసార్లు విఫలమయ్యారు. వైసీపీ పాలనలో తదుపరి నోటిఫికేషన్లు లేకపోవడంతో, అతను తన కుటుంబాన్ని పోషించడానికి రోజువారీ కూలీగా పనిచేయవలసి వచ్చింది. అతని భార్య, పిల్లలు కూడా రోజు గడిచేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. 
 
కష్టాలు ఉన్నప్పటికీ, రాజు తన కలను ఎప్పుడూ వదులుకోలేదు. పని తర్వాత తనకు దొరికిన కొద్ది సమయంలోనే అతను పరీక్షకు సిద్ధమయ్యారు. ఏడు సంవత్సరాల విరామం తర్వాత, అతను ఈ సంవత్సరం టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీకి హాజరయ్యారు. చివరికి ఆ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యారు. ప్రస్తుతం ఆయన సోషల్ స్టడీస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా నియమితుడయ్యారు. త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిజిటల్ అరెస్టుకు భయపడి... గుండెపోటుతో రిడైర్డ్ డాక్టర్ మృతి