Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్ పాలనకు రెండేళ్లు పూర్తి : రేపు పుస్తకం రిలీజ్

సీఎం జగన్ పాలనకు రెండేళ్లు పూర్తి : రేపు పుస్తకం రిలీజ్
, ఆదివారం, 30 మే 2021 (09:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి ఆదివారానికి రెండేళ్లు పూర్తయింది. మొత్తానికి సమస్యలు, విపక్షాల ఆరోపణలు ఏవైనా, సంక్షోభాలు విరుచుకుపడుతున్నా.. చెక్కుచెదరని ఆత్మ‌స్థైర్యంతో సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలనను సాగించారు. 
 
ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి, ఆ దిశలోనే, ఆ లక్ష్యసాధనే శ్వాసగా పనిచేసుకుపోతున్నారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే గ్రామ, వార్డు సచివాలయాలు స్థాపించి.. గ్రామస్వరాజ్యానికి బాటలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా 4.5 లక్షల నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. 500 రకాల సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. 
 
పెన్షన్‌ మొదలు ఏ పథకమైనా నేడు గడప ముందుకొచ్చేలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 11,152 గ్రామ సచివాలయాలు, 3,913 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో వారధులవుతున్నారు. జగన్ సర్కారు రెండేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ సోమవారం జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు. 
 
అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు