ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడుకు సమీపంలోని యర్లపాడు మండలం వంకాయలపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ యూనిట్‌ను ఐటీసీ సంస్థ రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించింది. మొత్తం 6.2 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఈ స్పైసెస్ పార్కును అభివృద్ధి చేశారు.
ఈ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, ఈ యూనిట్ వల్ల 14 వేల మంది రైతులు లబ్ధి పొందవచ్చన్నారు. పైగా, రెండో యూనిట్‌ను కూడా సద్ధం చేసేందుకు ఐటీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఏపీ రైతులకు అండగా నిలబడేందుకు ఐటీసీ కంపెనీ ముందుకు రావడం సంతోషంగా ఉన్నారు.
అదేసమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) కూడా రైతు జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల కాలంలో ఏపీలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం జగన్ గుర్తుచేశారు.