Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా సర్కారుకు షాక్ : రంగులపై జీవోను సస్పెండ్ - ఎమ్మెల్యేలకు నోటీస్

Advertiesment
Andhra Pradesh
, మంగళవారం, 5 మే 2020 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా సర్కారుకు హైకోర్టు మరోమారు తేరుకోలోని షాకిచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. జీవో నెంబర్ 623ను సస్పెండ్ చేస్తూ మధ్యంత ఉత్తర్వులను జారీ చేసింది.
 
పంచాయతీ కార్యాలయాలకు రంగులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా కొత్తగా 623 జీవోను విడుదల చేశారంటూ న్యాయవాది సోమయాజి పిల్ దాఖలు చేవారు. 
 
పాత జీవోలో ఉన్న అంశాలే ఈ జీవోలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ రంగులన్నీ అలాగే ఉండేలా కొత్త జీవో ఉందని తెలిపారు. దీంతో, జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
మరోవైపు, ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో ఆర్కే.రోజా, విడదల రజని, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య, వెంకట గౌడ్‌లు ఉన్నారు.
 
కరోనా వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలే కారణమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఇంద్రనీల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. అనంతరం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
 
లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు నిత్యావసరాలను పంచడం, డబ్బు పంపిణీ చేయడం, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేశారు. ఈ కార్యక్రమాల సందర్భంగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి విజువల్స్ మీడియాలో ప్రసారమయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఆ 3 జిల్లాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి అధికం, ఏం చేద్దాం? కేసీఆర్ సమీక్ష