Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజ్: నారాయణ అరెస్ట్

tdp leader narayana
, మంగళవారం, 10 మే 2022 (13:06 IST)
ఏపీలో గతకొన్ని రోజలుగా పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ లీకేజీల వ్యవహారంలో ఆయన పాత్ర ఏమైనా ఉందా? లేదా? అనే కోణంలో సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. 
 
ఈ వ్యవహారం వెనుక నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నట్లు కొద్దిరోజుల క్రితం తిరుపతి సభలో ఏపీ జగన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ అరెస్టు