Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికపై అత్యాచారం.. మూడు నెలల గర్భిణిని కిరాతకంగా..?

Advertiesment
బాలికపై అత్యాచారం.. మూడు నెలల గర్భిణిని కిరాతకంగా..?
, శనివారం, 7 డిశెంబరు 2019 (11:26 IST)
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. ఓ వైపు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో.. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి అతడి తల్లి కూడా సహకరించింది. దీంతో నిందితుడితో పాటు.. అతని తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విజయవాడ భవానిపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. మూడోనెల గర్భిణి అయిన తన భార్యను భర్త అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఉరివేసి హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక గ్రామానికి చెందిన మదర్ థెరిసా (22), ఆమె భర్త నాగేశ్వరరావు (28)కి మూడేళ్ల క్రితం పెళ్లయింది. పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. 
 
పెళ్లయిన నాటి నుంచి భీమవరంలో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. మదర్ థెరిసా, నాగేశ్వరావు దంపతులు కులాంతర వివాహం చేసుకోవడంతో తరచూ వారి మధ్య గొడవలు వస్తుండేవి. ఈ నేపథ్యంలో మదర్ థెరిసాను భర్త నాగేశ్వరరావు ఉరివేసి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్యానంద ముంచేశాడు.. బండారం బయటపెడ్తా.. విదేశీ భక్తురాలు