ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్‌ఆర్ జిల్లా కొయ్యూరులోని బూదరాళ్ల పంచాయతీ పరిధి మహిళా మాంత్రికురాలిని హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. రష్మో (వయస్సు 34) ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్‌ఆర్ జిల్లా కొయ్యూరులోని బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని మాంత్రికురాలిగా జీవనం సాగించింది. ఆమె ఊరికి దూరంగా ఒక గుడిసెలో నివాసం వుంటోంది. జాతకం, మంత్రవిద్యను తెలుసుకున్న ఆమెను చూసేందుకు చాలామంది వచ్చి వెళ్తుండేవారు.
ఈ పరిస్థితిలో గ్రామంలోని ప్రజలకు అకస్మాత్తుగా ఓ మర్మమైన వ్యాధి సోకింది. కొద్దిమంది అనారోగ్యంతో చనిపోయారు. ఆ సమయంలో రష్మో చేతబడి వల్లనే గ్రామంలో వ్యాధి వ్యాపించిందని కొందరు ప్రచారం చేశారు. దీంతో గ్రామంలోని కొందరు రష్మోను చంపితేనే ఊరి నుంచి రోగాలు దూరమవుతాయని నిర్ణయించుకున్నారు.
ఇంతలో, సంఘటన జరిగిన రోజు, రష్మో గుడిసె తగలబడింది. ఆమె ఆ గుడిసెలోనే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రష్మో మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రష్మోను మహిళలు హత్యచేసినట్లు తెలిసింది. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.