Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంగోలులో పసుపు పండగు - నేటి నుంచి టీడీపీ మహానాడు

ntr statue
, శుక్రవారం, 27 మే 2022 (07:16 IST)
ఒంగోలు పట్టణం పసుపు మయమైంది. తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికగా నిలించింది. రెండు రోజుల పాటు ఒంగోలు శివారు ప్రాంతమైన మండువవారిపాలెంలో ఈ పండుగను నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. శుక్ర, శనివారాల్లో టీడీపీ మహానాడు జరుగనుంది. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ నేతలంతా ఇప్పటికే ఒంగోలుకు చేరుకున్నారు. 
 
ఈయన గురువారం మధ్యాహ్నానికే ఒంగోలుకు చేరుకున్నారు. నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా తెదేపా నిర్వహించే అతిపెద్ద మహోత్సవం మహానాడు కావడంతో అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడకు తరలి వస్తున్నారు. 
 
ఒంగోలు నగరంలో ప్రధాన వీధుల్లో ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతోపాటు, ముఖ్యనేతల ఫొటోలతో ముద్రించిన ఫ్లెక్సీలు, ఎన్టీఆర్‌ శత జయంతి ఫ్లెక్సీలు కళక ళలాడుతున్నాయి. నగర శివారులతోపాటు ప్రధాన సెంటర్లు, ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో మహా నాడుకు స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. జాతీయ రహదారి వెంట మంగమ్మకాలేజి వద్ద నుంచి పసుపు తోరణాల ప్రత్యేక ఆకర్షణగా మారాయి. 
 
మరోవైపు మహానాడు ప్రాంగణంలో ఎటు చూసినా పసుపుమయంగా ఏర్పాట్లు చేశా రు. విద్యుద్దీపాల అలంకరణ, మహానాడుకు విచ్చేసేవారికి వేర్వేరుగా గ్యాలరీలు, వీఐపీ గ్యాలరీలు, రక్తదాన శిబిరాలు, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల గొప్పతనం చాటుతూ ఫొటో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా విచ్చేసే లక్షలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్‌ అభిమానుల కోసం అవసరమైన రుచికరమైన వంటకాలను ఈ మహానాడులో వడ్డించేలా ఏర్పాట్లు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్ మరో శ్రీలంకలా మారనుందా? ఏటీఎంలలో డబ్బుల్లేవ్, పెట్రోల్ బంకుల్లో పెట్రోలు లేదు...